Hero Raviteja: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుండి రీసెంట్‌గా విడుదలైన ‘ఈగల్(Eagle)’ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా… సినిమాపై క్రేజ్ ను అమాంతంగా పెంచేసింది. ఆ తరువాత విడుదలైన ఫస్ట్ సింగిల్ ఊర మాస్ అంథమ్ ‘ఆడు మచ్చా’ పాట చార్ట్ బస్టర్ హిట్ అయి… సినిమా క్రేజ్ ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈగల్ సెకండ్ సింగిల్ ‘గల్లంతే’ పాటని డిసెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ విషయం తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనితో ‘ఈగల్’ సెకండ్ సింగిల్ కోసం రవితేజ అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hero Raviteja – ‘ఈగల్’ సెకండ్ సింగిల్ ‘గల్లంతే’ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్
‘ఈగల్’ సినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ ‘గల్లంతే’ ను ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో పాటు దానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ పోస్టర్‌లో రవితేజ, కావ్య థాపర్ ల రొమాంటిక్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ సింగిల్ మాస్ సాంగ్ అయితే సెకండ్ సింగిల్ మనసుని హత్తుకునే మెలోడీగా ఉంటుందని అనౌన్స్‌మెంట్ పోస్టర్ సూచిస్తోంది. ‘ఈగల్’లో రవితేజ మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనుండగా… అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల కీలక పాత్రలలో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్ మరియు దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read : Hero Ajit Kumar: ప్రశాంత్ నీల్‌తో అజిత్ సినిమా ?