Hero Ranbir Kapoor: ఎట్టకేలకు తన కుమార్తెను పరిచయం చేసిన రణ్ బీర్

ఎట్టకేలకు తన కుమార్తెను పరిచయం చేసిన రణ్ బీర్

Hero Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ ల గారాల పట్టి రాహా ఎట్టకేలకు కేమరా ముందుకు వచ్చింది. సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యానిమల్‌’ సినిమాతో తన కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రణ్ బీర్, గంగూభాయ్ కతియావాడి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన ఆలియా భట్ లు క్రిస్టమస్ సందర్భంగా తమ ముద్దుల తనయ రాహాను కేమరా ముందుకు తీసుకువచ్చారు. రాహా వారి జీవితంలోనికి వచ్చి ఏటాది గడుస్తున్నా ఇంతవరకు వారు ఆమెను ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఎట్టకేలకు క్రిస్మస్‌ సందర్భంగా రాహాను ముంబైలో ప్రేక్షకులకు చూపించారు.

Hero Ranbir Kapoor Daughter’s Face Revealed

రణ్ బీర్, ఆలియాల ముద్దుల కూతురు రాహా చూడటానికి చాలా అందంగా, ఎంతో బబ్లీగా ఉంది. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ నెటిజన్స్ రాహ చాలా అందంగా ఉందని, ఎంతో క్యూట్ గా ఉందంటూ, పాపకి ఆలియా పోలికలే వచ్చాయంటూ… ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా రన్ బీర్(Ranbir Kapoor), ఆలియా ఫ్యాన్స్ ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఆ ముగ్గురు కలిసి ఉన్న ఆ వీడియోను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మించింది. కూతురుతో టైమ్ స్పెండ్ చేయడం కోసం.. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చి మరీ పాపను చూసుకుంటున్నారు ఈ బాలీవుడ్ జంట. రీసెంట్ గా ఫస్ట్ మ్యారేజ్ ఆనివర్సరీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే రణ్ బీర్ ఆలియా ఇప్పటివరకు కూతురి ముఖాన్ని కెమెరాలకు చూపించలేదు. సోషల్​మీడియాలోను ఒక్క ఫొటో కూడా పోస్ట్​ చేయలేదు. అంతే కాకుండా చిన్నారికి రెండేళ్లు వచ్చే వరకు.. ఫొటోలు పోస్ట్​ చేయరని ఆలియా సన్నిహితులు తెలిపారు.

Also Read : Hero Vijay: విజయ్‌ 68వ చిత్రం పేరు.. గోట్‌ ?

Alia Bhattranbir kapoor
Comments (0)
Add Comment