Hero Ram Pothineni : ఒకే నెలలో 18 కిలోలు తగ్గిన హీరో రామ్ పోతినేని

డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ క్లిక్ ఇచ్చిందని....

Hero Ram : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే డబుల్ ఇస్మార్ట్ కోసం హీరో రామ్ ఏకంగా 18 కిలోలు బరువు తగ్గాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డైట్.. ఒకే నెలలో 18 కిలోలు ఎలా తగ్గాడో చెప్పుకొచ్చాడు. అలాగే తనలా ఎవరూ ట్రై చేయొద్దని హెచ్చరిస్తున్నాడు.

Hero Ram Pothineni..

డబుల్ ఇస్మార్ట్ సినిమా కోసం పూరీ జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ క్లిక్ ఇచ్చిందని.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలాగే ఈసినిమాలోనూ షర్ట్ లేకుండా క్లైమాక్స్ చేయాలనుకున్నామని.. ఆ పార్ట్ అంతా నవంబర్ లోనే షూట్ చేయాలని అనుకున్నామని.. స్కంద రిలీజైన తర్వాత తనకు 2 నెలలు మాత్రమే సమయముందని తెలిపారు. ఆ తర్వాత వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెల రోజులు ఉండి.. ఫుల్లుగా వర్కౌట్ చేసి బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. తక్కువ టైంలో బరువు తగ్గడం ఆరోగ్యానిక చాలా ప్రమాదమని.. తాను చేసినట్లు ఎవరూ ప్రయత్నించొద్దని అన్నారు. స్కంద సినిమా సమయానికి రామ్ పోతినేని(Hero Ram) ఏకంగా 86 కిలోలు ఉన్నాడు. కానీ డబుల్ ఇస్మార్ట్ కోసం రోజూ హెల్తీ డైట్ ఫాలో అవుతూ 18 కిలోలు తగ్గాడు. పూర్తిగా 68 కిలోలకు చేరుకున్నాడు. సాధారణంగా ఇలా ఒకేసారి తగ్గితే మాత్రం శరీరంలో లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదముంటుంది. ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది.

Also Read : Thalavan OTT : ఓటీటీలో అలరిస్తున్న మలయాళ థ్రిల్లర్ ‘తలవన్’ తెలుగులో…

Ram PothineniTrendingUpdatesViral
Comments (0)
Add Comment