Ram Charan : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ పిల్లలను మువ్వగోపాలుడిలా ముస్తాబు చేశారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. ఇక సినిమా తారల ఇళ్లలోనూ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సతీమణి ఉపాసన గారాల పట్టి క్లింకారాతో కలిసి ఈ పండగను జరుపుకొంది. అనంతరం పూజకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ అమ్మ, కారా స్వీట్ సింపుల్ పూజా’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇందులో క్లింకార ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఉపాసనతో పాటు రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Ram Charan…
రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లైన సుమారు 10 ఏళ్లకు క్లింకారా పుట్టింది. గతేడాది మెగా ఫ్యామిలీ ఇంట్లో క్లింకార కొణిదెల అడుగు పెట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రామ్ చరణ్ కూతురు ఫేస్ ఇంకా రివీల్ చేయలేదు. క్లింకార ఎలా ఉంటుందో చూద్దామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ఆ తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో పనిచేయనున్నారు. ఇందులో చెర్రీ సరసన జాన్వీకపూర్ నటించనుంది.
Also Read : Devara Update : ఫ్యాన్స్ కోసం మరో కీలక అప్డేట్ ఇచ్చిన ‘దేవర’ టీమ్