Rajinikanth : ఒకప్పటి ఆర్టీసీ కండక్టర్…ఇప్పటి హీరో తలైవాకు జన్మదినం

దేవుడిచ్చిన లైఫ్‌ను కష్టం, నమ్మకం అనే పునాది వేసి ఒక్కో మెట్టూ ఎక్కిన స్టార్‌ ఆయన...

Rajinikanth : ‘దేవుడు శాసించాడు. ఈ అరుణాచలం పాటించాడు’ అంటూ రజనీ డైలాగ్‌ చెబుతుంటే అభిమానులు ఆనందానికి హద్దే ఉండదు. ఇది కేవలం సినిమాలో డైలాగ్‌ మాత్రమే కాదు.. ఆయన పాటించే నియమం కూడా. మన జీవితంలో జరిగే ఏదైనా భగవంతుడి ఆజ్ఞతోనే జరుగుతుందని ఆయన నమ్మకం. దేవుడిచ్చిన లైఫ్‌ను కష్టం, నమ్మకం అనే పునాది వేసి ఒక్కో మెట్టూ ఎక్కిన స్టార్‌ ఆయన. పేరు మూడక్షరాలే కావచ్చు. కానీ రజనీ(Rajinikanth) ఒక బ్రాండ్‌. ఆ పేరు వెనక చెప్పలేనంత స్టార్‌డమ్‌ ఉంది. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఆయన కనిపిస్తే చాలు అభిమానులకు పండగే. నిర్మాతలకూ పెద్ద పండగే,చ, కాసుల వర్షం కూడా. ఆయన బాడీ బిల్డర్‌ కాదు.. మంచి రంగూ కాదు. ఆరగడులు ఆజానుబావుడు కాదు.. నల్లగా, బట్టతలతో సాధారణంగా ఉంటారు. కానీ ఆయన స్టైల్‌, మేనరిజం ఎవర్‌గ్రీన్‌. ఎవరికి రానిది, సాధ్యపడనిది. ఎలాంటి వారినైనా మంత్రముగ్థులను చేయగల సమ్మోహన శక్తి ఆయనకుంది. ఆనందాలకు పొంగిపోడు.. బాధల్లో కుంగిపోడు. గురువారం ఆయన పుట్టిన రోజు(Birthday) సందర్భంగా రజనీ(Rajinikanth) కెరీర్‌లో ఆసక్తికర అంశాలను గుర్తు చేసుకుందాం.

Rajinikanth Birthday..

రజనీ నటుడని అందరికీ తెలుసు. మరి నటుడు కాకముందు? రజనీకాంత్‌(Rajinikanth) అసలు పేరు శివాజీరావ్‌ గైక్వాడ్‌. బెంగళూరు జన్మించారు. రాణోజీరావు, రాంబాయి దంపతులకు పుట్టిన శివాజీరావ్‌.. దురదృష్టవశాత్తూ ఐదేళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఇంట్లో ఎన్నో గొడవలు, దూషణలు ఎదురవడంతో చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. ‘ఎంత చెడ్డవారిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పొస్తుంది’ అన్నది శివాజీరావ్‌ విషయంలోనూ నిజమైంది. రామకృష్ణ మఠం ఆయనలో సత్ప్రవర్తన, ఆధ్యాత్మికత అనే బీజాలను నాటింది. ఆర్థిక సమస్యలు వెంటాడడంతో శివాజీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ తర్వాత చదువు కొనసాగలేదు. దొరికిన పని చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ క్రమంలో కేఎస్‌ ఆర్టీసీలో బస్‌ కండక్టర్‌గా మారారు. బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనలోని కళాకారుడిని ఎప్పుడూ వదిలేయలేదు శివాజీ. చిన్నతనం నుంచే ఆడపాదడపా నాటకాలు వేసేవారు. ప్రతి నాటకంలోనూ ఆయనకుంటూ ప్రత్యేక శైలి ఉండేది.

అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఓసారి నాటకంలో దుర్యోధనుడి పాత్రలో రజనీ(Rajinikanth)ని చూసిన అతని స్నహితుడు రాజ్‌ బహదూర్‌ ఆ నటనకు మంత్ర ముగ్థుడై డబ్బులిచ్చి మరీ శివాజీని మద్రాసు పంపాడు. మద్రాసు చేరుకున్న శివాజీ నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత అవకాశాల వేట మొదలైంది. ఏవీఎం, జెమిని, విజయ వాహిని ఏ స్టూడియోల చుట్టూ ప్రదక్షణలు చేశారు. అవకాశాలు రాలేదు. తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఉన్న ఉద్యోగం పోయింది. ‘ఈ బతుకు బతికి వేస్ట్‌’ అనుకుంటూ చివరిగా తన స్నేహితుడిని కలిసేందుకు బెంగళూరు వెళ్లారు. రైలు దిగిన వెంటనే ఫ్రెండ్‌ రమేశ్‌ను కలిశాడు. ఆయన పెయింటర్‌. శివాజీ రావడం చూసి, కొంచెం ేసపు వేచి ఉండమని సైగ చేశాడు రమేశ్‌. సరేనని శివాజీ ఒక స్తంభానికి ఆనుకుని కూర్చొని చూస్తూ ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో గోడపై గీసిన రాఘవేంద్ర స్వామి బొమ్మను చూసి శివాజీలో తెలియని ఆనందమేదో కలిగింది. ‘నేనున్నా. నీకేం కాదు’ అన్నట్లు అనిపించింది. అప్పటివరకూ శివాజీని ఆవరించిన నిరాశ, నిస్పృహలు చెల్లా చెదురైపోయాయి. పోరాడితే పోయేదేముంది అన్నట్లు శివాజీ ముందుకు కదిలారు.

‘ఎక్కడికెళ్లాలమ్మా?..ఈ లగేజీ మీదేనా’ అని బస్‌ ఎక్కిన వారిని సాదారణంగా అడిగి ఉంటే శివాజీ గురించి మనం చర్చించుకునేవాళ్లమే కాదు. ‘వృత్తే మనకు దైవం’ అని ఆయన తన సినిమా పాటలో చెప్పినట్టే కండక్టర్‌ విధిని ఎంతో హూందాగా నిర్వర్తించేవారు. శివాజీరావ్‌ టికెట్టు ఇచ్చే విధానం, ‘రైట్‌.. రైట్‌’ అని చెప్పే పద్థతి, ముఖంపైకి దూసుకొచ్చే జుట్టును పక్కకు జరిపే స్టైల్‌కు ప్యాసింజర్స్‌ ఓ హీరోని చూసినట్టుగా భావించేవారు. అయితే, ప్రయాణికులు సినిమా చూసినట్టు చూసి వదిలేసినా.. బస్‌ డ్రైవర్‌ రాజ్‌ బహదూర్‌.. శివాజీరావ్‌ దృష్టిని నాటకాల వైపు మళ్లించాడు. కండక్టర్‌ పనైనా, నటన అయినా తనకు అన్నీ ఒకటే కాబట్టి శివాజీరావ్‌ అక్కడా తన మార్క్‌ చూపించారు. చిన్న పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసారు. కండక్టర్‌గానే శివాజీరావ్‌ మిగిలిపోకూడదని భావించిన రాజ్‌ బహదూర్‌ ఆయన్ను మద్రాసు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నటన నేర్చుకునేందుకు ప్రోత్సహించారు. శివాజీకి అండగా నిలిచారు.

Also Read : Kiran Abbavaram : ‘క’ సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో వస్తున్న కిరణ్ అబ్బవరం

BirthdayrajinikanthTrendingUpdatesViral
Comments (0)
Add Comment