Hero Rajinikanth : జైలర్ సీక్వెల్ కి ఎస్ చెప్పిన తలైవా

జైలర్’ సీక్వెల్‌కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అనిరుధ్‌, నెల్సన్‌ దిలీప్‌ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది

Hero Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఓ సూపర్ స్టార్ సాలిడ్ హిట్ కొట్టి చాలా రోజులైంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ‘జైలర్’ చిత్రం అతనికి 700 కోట్లు వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. ‘బీస్ట్’ సినిమా తర్వాత ‘జైల ర్ ` మూవీకి హార్డ్ వర్క్ చేశాడు.అనిరుద్ సంగీతం జైలర్ కు హైలైట్ . ఓవరాల్ గా ఈ జైలర్ సినిమా సూపర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

Hero Rajinikanth Movies

ఇదిలా ఉంటే ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు కోలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ పలు సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే జైలర్ సినిమాకు సీక్వెల్ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది. ‘జైలర్’ సీక్వెల్‌కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అనిరుధ్‌, నెల్సన్‌ దిలీప్‌(Nelson Dilipkumar) ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : HanuMan Team Donates : రాములవారికి విరాళం సిద్ధం చేసిన హనుమాన్ టీమ్

Moviesnelson dileep kumarrajinikanthThalaivaaTrendingUpdates
Comments (0)
Add Comment