Hero Prithviraj : పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఏం చేసినా అది సంచలనమే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీస్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు. తన సినిమాలో చిన్న పాత్ర దక్కితే చాలు అని ఇప్పుడు సినిమా రంగానికి చెందిన నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం తను అందగాడైన ప్రిన్స్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29 పేరుతో మూవీ స్టార్ట్ చేశాడు. ఈ బిగ్ ప్రాజెక్టుకు జక్కన్న తండ్రి , బీజేపీ రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చాడు.
Hero Prithviraj Sukumaran Movie Updates
ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలు పెట్టాడు రాజమౌళి. హైదరాబాద్ లో భారీ ఎత్తున సెట్ ను ఏర్పాటు చేశాడు. మూవీలో ఎవరెవరు ఉంటారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. హీరోగా మహేష్ బాబు కౌబాయ్ పాత్ర పోషిస్తుండగా హీరోయిన్ గా కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తను భాగ్యనగరంలో హల్ చల్ చేస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు జక్కన్న.
తాజాగా మహేష్ మూవీపై ఆసక్తికర వార్త వైరల్ గా మారింది. ప్రముఖ మలయాళ సినీ రంగానికి చెందిన పృథ్వీరాజ్ సుకుమారన్(Hero Prithviraj) ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్. విలన్ కేరెక్టర్ కోసం సుకుమారన్ తో పాటు ముంబైకి చెందిన అగ్ర నటుడు జాన్ అబ్రహంను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read : Hero Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషన్