Raja Saab : తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు మారుతి. పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ తో పూర్తిగా రొమాంటిక్ మూవీ తీయబోతున్నాడు. దానికి ది రాజా సాబ్(Raja Saab) అని పేరు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతోంది.
Hero Prabhas-Raja Saab Updates
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి బిగ్ సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. గతంలో ప్రభాస్ లవర్ బాయ్ రోల్ లో మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీలో నటించాడు..మెప్పించాడు.
ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించాక తన పాత్రలు మారి పోయాయి. ప్రస్తుతం మారుతి ది రాజా సాబ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు .
తాజాగా సంక్రాంతి పండుగ పర్వదినం సందర్బంగా మూవీ మేకర్స్ ది రాజా సాబ్ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పోస్టర్ పై న్యూ ట్యాగ్ లైన్ చేర్చారు. “హారర్ ఈజ్ ది న్యూ హ్యూమర్” అంటూ పేర్కొన్నారు.
Also Read : డైరెక్టర్ బాబీకి బాబీ డియోల్ థ్యాంక్స్