Hero Prabhas: త్వరలో ప్రారంభం కానున్న ప్రభాస్ ‘స్పిరిట్‌’

త్వరలో ప్రారంభం కానున్న ప్రభాస్ 'స్పిరిట్‌'

Hero Prabhas: రణ్ బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘యానిమల్‌’ సినిమా బ్లాక్ బస్టర్ కాబడంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 890 కోట్లు వసూలు చేసి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి దూసుకుపోతుంది. దీనితో మంచి జోష్ మీద ఉన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన నెక్స్ట్ సినిమాను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తో చేస్తున్నానని దీనికి ‘స్పిరిట్‌’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు ప్రకటించారు.

మరోవైపు కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సలార్’ కూడా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాహుబలి-2 రికార్డులను అధికమించి ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతుంది. దీనితో సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ‘స్పిరిట్‌’ సినిమాపై ఆశక్తి పెరిగిపోతుంది. టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఓ ఇంటర్వూలో దర్శకుడు సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Hero Prabhas Movie Updates

ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ త్వరలో ‘స్పిరిట్‌’ను పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు దాదాపు పూర్తయినట్లు దర్శకుడు సందీప్‌ తెలిపారు. వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ప్రారంభిస్తామన్న దర్శకుడు సందీప్… ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేసారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు కానున్న ఈ సినిమాలో ప్రభాస్‌ శక్తిమంతమైన పోలీసు పాత్రలో కనిపించనుండగా… దీనికి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. దీనితో ప్రభాస్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. సలార్ పార్ట్ 2, మారుతి దర్శకత్వంలో మరో సినిమా ఈ ఏడాది వస్తుండగా, వచ్చే సంక్రాంతికల్లా ఈ స్పిరిట్ వస్తుందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Anjali Patil: సైబర్‌ మాయగాళ్ళ వలలో ‘కాలా’ నటి !

PrabhasSandeep Kishan
Comments (0)
Add Comment