Hero Prabhas : కల్కి 2898 AD సక్సెస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన డార్లింగ్

అయితే ఈ చిత్రాలు, అందులో పాత్రల గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది...

Hero Prabhas : ‘కల్కి 2898 ఎడి. చిత్రం సక్సెస్‌పై ప్రభాస్‌ స్పందించారు. నిర్మాణ సంస్థ విడుదల చేసిన వీడియోలో తన అభిమానులకు, దర్శకనిర్మాతలకు తోటి నటీనటులకు కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ అభిమానులు లేకపోతే నేను జీరో . అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. రెండో భాగం మరింత భారీతనంతో ఉంటుంది. కల్కి మొదటి భాగానికి ఇంత భారీ విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు’’ అని ప్రభాస్‌ అన్నారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు చెబుతు ఓ వీడియో విడుదల చేసింది.

Hero Prabhas Comment

ప్రస్తుతం ‘కల్కి’ విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్‌(Hero Prabhas) తదుపరి ఏ సినిమా కోసం రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. ‘ సలార్‌ 2’, ‘కల్కి 2898 ఎ.డి’ రెండో భాగంతోపాటు హను రాఘవపూడి, సందీప్‌రెడ్డి వంగా తయారు చేసిన కథలు ప్రభాస్‌ డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ చిత్రం సెట్స్‌పై ఉంది. వీటన్నింటినీ చేసుకురావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాలు, అందులో పాత్రల గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా యుద్థం, ప్రేమ మేళవింపుగా ఉంటుందని, అందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ఆ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

Also Read : Sai Dharam Tej : తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మెగా హీరో

Kalki 2898 ADPrabhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment