Hero Prabhas: ‘కేజిఎఫ్’ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘సలార్’. డిసెంబరు 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ సినిమా… కలెక్షన్ల విషయంలో వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ… ప్రభాస్ మాత్రం ప్రమోషన్ లో పెద్దగా పాల్గొనలేదు. కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో… సినిమా ప్రమోషన్ ను సరిపెట్టేసారు. మధ్యలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ… పెద్దగా ప్రభాస్(Prabhas) కనిపించలేదు. దీనితో చిత్ర యూనిట్ శుక్రవారం రాత్రి కర్ణాటకలో ‘సలార్’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు.
Hero Prabhas Viral
ఈ క్రమంలో కర్ణాటక వెళ్లిన ప్రభాస్… మంగుళూరులోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వెళ్లాడు. ‘సలార్’ నిర్మాత విజయ్ కిరగందూర్‌తో కలిసి శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వచ్చిన ప్రభాస్ కు… ఆలయ కమిటీ సభ్యులు సాంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైట్ క్యాప్, మాస్క్ ధరించిన ప్రభాస్.. ‘సలార్’ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్‌తో కలిసి శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి వచ్చిన విజువల్స్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ‘
‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రభాస్… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి’ లో నటిస్తున్నారు. ఈ సినిమాను మే 9న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ఇటీవల మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. మరోవైపు మారతి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ‘సలార్ పార్ట్ 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా 2025లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Also Read : Racharikam Movie : అప్సరా కాళీమాత లుక్ లో వైరల్ అవుతున్న ‘రాచరికం’ పోస్టర్