Hero Prabhas : డార్లింగ్ ప్రభాస్ పోస్ట్ తో షాక్ అయిన ఫ్యాన్స్

ప్రభాస్'కల్కి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే...

Prabhas : యాక్టర్ ప్రభాస్ పెద్దగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడైనా ఏదైనా పోస్ట్ చేసిన సినిమాకి సంబంధించిన పోస్టర్స్ మినహా ఏం పోస్ట్ చేయరు. ఆయన ఎప్పుడు సినిమా షూటింగ్స్ లోనే బిజీగా గడుపుతుంటారు. ప్రస్తుతం ఆయన చేతిలో స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ది రాజా సాబ్, ఫౌజీ ఇంకొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రభాస్(Prabhas) ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Herp Prabhas Post

ప్రభాస్’కల్కి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే. దేశవ్యాప్తంగా అత్యుతమ నటులలో ఆమె ఒకరు. నేడు ఆమె 39వ పుట్టినరోజు. అయితే ఏ సెలబ్రెటీ బర్త్ డేకి పెద్దగా సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పని ప్రభాస్.. దీపికా పుట్టిన రోజుకి మాత్రం స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా.. “ఎవర్ టాలెంటెడ్ అయినటువంటి దీపిక పదుకొనే కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఎప్పటికీ అంతులేని హ్యాపీనెస్, ఆనందం ఇలాగే ఉండాలి” అంటూ సంతోషంగా ఉన్న దీపికా ఫోటోని షేర్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా దీపికాకు జోరుగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇక’ది రాజా సాబ్’ మూవీ విషయానికొస్తే.. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన సినిమా వాయిదా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా “రాజా సాబ్” మూవీని రూపొందిస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా ప్రొడ్యూస్ చేస్తోంది. ‘రాజా సాబ్’ పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం 80% షూటింగ్ ముగిసింది.

Also Read : Actor Siva Balaji : నటి ‘పూనమ్ కౌర్’ వ్యాఖ్యలపై స్పందించిన ‘మా’ కోశాధికారి

Deepika PadukonePrabhasTrendingUpdatesViral
Comments (0)
Add Comment