Hero Prabhas : భారీ వేగంతో దూసుకుపోతున్న డార్లింగ్ ‘రాజా సాబ్’

మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌తోపాటు మరో కథానాయిక ఇందులో నటిస్తోంది...

Hero Prabhas : ప్రభాస్‌ మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్‌ 2, రాజాసాబ్‌, కల్కి 2, స్పిరిట్‌, హను రాఘవపూడితో ఓ చిత్రం ఉన్నాయి. ఒక్కో షూటింగ్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్‌’తో చిత్రీకరణ పరుగులు పెట్టిస్తున్నారు.

Hero Prabhas Movie Updates

హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో హీరో, కథానాయికలు, కొద్దిమంది హాస్యనటులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో టి.జి.విశ్వప్రస?ద్‌ నిర్మిస్తున్న చిత్రమిది. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌తోపాటు మరో కథానాయిక ఇందులో నటిస్తోంది. హారర్‌ అంశాలతో కూడిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌లో అలరించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లుక్‌తో ఆకట్టుకున్నారు. విజువల్‌గా మరింత అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Hero Simbu : తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల విరాళంపై స్పందించిన తమిళ హీరో

CinemaPrabhasThe Raja SaabTrendingUpdatesViral
Comments (0)
Add Comment