Hero Prabhas: మరో అరుదైన రికార్డ్‌ సాధించిన ప్రభాస్ !

మరో అరుదైన రికార్డ్‌ సాధించిన ప్రభాస్ !

Hero Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ నుండి పాన్‌ ఇండియా… కాదు కాదు పాన్ వరల్డ్ రేంజ్‌లో అభిమానులను అలరిస్తున్నారాయన. బాహుబలి సిరీస్ తరువాత సాహో, రాధేశ్యామ్, సలార్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతోంది. రేర్‌ కాంబినేషన్స్, రికార్డ్‌ స్థాయి బాక్సాఫీస్‌ నంబర్స్, భారీ పాన్‌ వరల్డ్‌ మూవీ లైనప్స్‌… ఇలా అన్ని అంశాల్లో ఎన్నో రికార్డులు, ఘనత సాధించిన ప్రభాస్‌ తాజాగా మరో అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) టాప్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌ ఆఫ్‌ ఇండియా లిస్టులో నిలిచిన ఏకైక హీరోగా ప్రభాస్‌ రికార్డ్‌ సాధించారు. దీనితో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. తమ అభిమాన హీరో సాధించిన రికార్డ్ ను మరల పదే పదే షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Hero Prabhas New Record

ట్విట్టర్‌ (ఎక్) ఇండియా తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో టాప్‌ 10 మోస్ట్‌ యూజ్డ్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌ ను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్‌(Hero Prabhas) మాత్రమే చోటు దక్కించుకున్నారు. ప్రభాస్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్… మోస్ట్ యూజ్డ్ ట్యాగ్స్ గా రికార్డు సృష్టించాయని మాట. తమ అభిమాన హీరో సాధించిన ఈ క్రెడిట్‌తో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే… నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్నారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్‌. దీనితో పాటు మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ లో రూపొందుతున్న ‘కన్నప్ప’లో కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌ 2’, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Also Read : Nagarjuna Akkineni: బ్యాంకాక్‌ లో కింగ్ నాగార్జున యాక్షన్ షురూ !

Kalki 2898 ADPrabhasRaja SaabSalaarSprit
Comments (0)
Add Comment