Hero NTR: జపాన్ లో సంభవించిన భూకంపంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. గత వారం రోజులుగా జపాన్ లోనే గడిపిన జూనియర్ ఎన్టీఆర్… సోమవారం హైదరాబాద్ చేరుకున్న కొన్ని క్షణాలకే జపాన్ లో భూకంపం సంభవించిదని తెలిసి తల్లడిల్లిపోయారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్… జపాన్ లో జరిగిన షూటింగ్ లో గత కొన్ని రోజులుగా పాల్గొన్నారు. ఇటీవల షూటింగ్ ముగించుకుని సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ‘దేవర’ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ఈ విపత్తు సంభవించడంపై తన హృదయం కలచివేసిందని… ఈ విపత్తు వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Hero NTR Comment
ఎన్టీఆర్ తన ట్విటర్‌లో రాస్తూ..’జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా. ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ పోస్ట్ చేశారు.
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం నాడు సుమారు 21 సార్లు భూమి కంపించడంతో పశ్చిమ జపాన్ ప్రాంతం అల్లకల్లోలమైంది. ఈ భూకంపం వలన ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా… వందలాది మంది గాయపడినట్లు సమాచారం. వరుస భూకంపాలతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ చేసి… సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలంతా ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే భూకంపం తీవ్రత బట్టి ఆ తరువాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది.
Also Read : Trisha Krishnan: సల్మాన్ సరసన త్రిష ?