Hero NTR: ‘ఏషియన్‌ వీక్లీ’ మ్యాగజైన్‌ టాప్‌ 50 జాబితాలో ఎన్టీఆర్‌

‘ఏషియన్‌ వీక్లీ’ మ్యాగజైన్‌ టాప్‌ 50 జాబితాలో ఎన్టీఆర్‌

Hero NTR:‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌… తాజాగా మరో ఘనతను సాధించారు. ‘ఏషియన్‌ వీక్లీ’ మ్యాగజైన్‌ విడుదల చేసిన 2023లో ఆసియాలో టాప్‌ 50 నటుల జాబితాలో తారక్‌ స్థానం దక్కించుకున్నారు. ‘ఈస్టర్న్‌ ఐ 2023’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో ఎన్టీఆర్‌ 25వ స్థానంలో నిలిచారు. ఈ ‘ఏషియన్‌ వీక్లీ’ టాప్ 50 జాబితాలో తెలుగు ఇండస్ట్రీ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్(Hero NTR) కావడం విశేషం. ఇక ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా… పలువురు బాలీవుడ్‌ నటీనటులు టాప్ 50లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ప్రముఖ అమెరికన్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ఇటీవల ప్రకటించిన 500 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎన్టీఆర్‌, రాజమౌళి చోటు దక్కించుకున్నారు.

Hero NTR Viral

ఇక సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’లో నటిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రెండు భాగాల్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మొదటి పార్టును ఏప్రిల్ 5న లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ నటిస్తుండగా… విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్ కనిపించనున్నారు. ఇటీవలే గోవాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. దీనితో పాటు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘వార్‌2’ లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ తో కలిసి ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

Also Read : Mansoor Ali Khan: మన్సూర్‌ కు మరో ఎదురుదెబ్బ

DevaraNTR
Comments (0)
Add Comment