Hero Nitin : యంగ్ హీరో నితిన్‌కి ప్రమాదం జరిగినట్టు సమాచారం. షూటింగ్ సమయంలో నితిన్ గాయపడినట్లు తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నాడు. ‘తమ్ముడు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణలో ప్రధాన పాత్రధారి నితిన్ గాయపడినట్లు తెలుస్తోంది. నితిన్ గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.
Hero Nitin Accident Viral
అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తమ్ముడు సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. అక్కడ భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్‌లో నితిన్(Nitin) ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
నితిన్ గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. గాయం పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు వారాలు పడుతుందని, అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నితిన్‌కు సూచించి నట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఈ మధ్య కాలంలో నితిన్ సినిమాలన్నీ నిరాశ పరుస్తున్నాయి. ఇప్పుడు తమ్ముడు ఈ సినిమాను హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఈ ప్రమాదం. దేనిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : Raghava Lawrence : మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్న లారెన్స్