Hero Nitin : పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపించిన హీరో నితిన్

ఇక ఏపీ ఎన్నికల విశ్లేషిస్తే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ లీడింగ్ లో కొనసాగుతోంది జనసేన...

Hero Nitin : ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కాబోతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన ఆయన ఈసారి బంపర్ మెజారిటీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. పిఠాపురం నుంచి బరిలోకి దిగిన ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన వంగ గీతపై ఏకంగా 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పుడే జనసేన శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. పవర్ స్టార్ ఎమ్మెల్యేగా త్వరలోనే అసెంబ్లీకి వెళుతున్నారంటూ స్వీట్టు పంచుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ నుంచి కూడా పవన్ కల్యాణ్ కు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే డైరెక్టర్ హరీశ్ శంకర్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ కు విషెస్ తెలిపారు. తాజాగా మరో హీరో నితిన్(Hero Nitin) కూడా ఈ జాబితాలో చేరాడు. సోషల్ మీడియా వేదికగా జనసేన అధిపతికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపాడు. ‘ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి నేను ఓ అభిమానిగా, సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నాను. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మా పవర్ స్టార్. మీకిప్పుడు మరింత పవర్ లభించనుంది’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు నితిన్.

Hero Nitin Tweet

ఇక ఏపీ ఎన్నికల విశ్లేషిస్తే పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ లీడింగ్ లో కొనసాగుతోంది జనసేన. మొత్తం 21 స్థానాల్లో గాజు గ్లాసు ఆధిక్యంలో ఉంది. ఇక జనసేన మద్దతుతో బరిలోకి దిగిన టీడీపీ, ఎన్టీయే కూటమి కూడా 150కి పైగా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక వైస్సార్ సీపీ ప్రస్తుతం కేవలం 16 స్థానాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ ఆధిక్యంపై స్పందించారు. ‘పవర్ స్ట్రోమ్.. ప్రస్తుతం, అలాగే రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ చేతిలో ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ గా ఉందని ట్వీట్ చేశారు.

Also Read : Shah Rukh Khan : లండన్ లో షారుఖ్ ఖాన్ కి అన్ని కోట్ల బంగ్లా ఉందా…?

Commentshero Nitinpawan kalyanTrendingViral
Comments (0)
Add Comment