Hero Nikhil : ప్రత్యేకంగా గవర్నర్ జిష్ణు దేవ్ ను కలిసిన హీరో నిఖిల్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది...

Nikhil : కార్తికేయ 2 సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil). అయితే దీని తర్వాత నిఖిల్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. స్పై ఫ్లాప్ గా నిలిచింది. 18 పేజేస్ యావరేజ్‌ గా నిలిచింది. ఇక ఇటీవల రిలీజైన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కూడా ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు స్వయంభూ అంటూ మరో పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో సంయుక్తా మేనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన స్టిల్స్ అంచనాలు పెంచేశాయి. త్వరలోనే స్వయంభూ నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. కాగా ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉంటోన్న నిఖిల్(Nikhil) తాజాగా లంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మను ప్రత్యేకంగా కలిశారు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. గవర్నర్ తో భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Hero Nikhil Meet

‘తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన జిష్ణు దేవ్ వర్మ జీతో సమావేశం ఎంతో అద్భుతంగా సాగింది. సినిమా నుంచి జాతీయ ఐక్యత వరకు వాటికి సంబంధించిన వివరాల గురించి ఆయన మాట్లాడారు. దీన్ని సాకారం చేసినందుకు అమరవాణి ఫౌండేషన్, మదన్ గోసావి జీ, సాకేత్ జీ అండ్ కృష్ణ చైతన్యలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నిఖిల్ ఏ సందర్భంలో గవర్నర్ ను కలిశాడో ఫుల్ క్లారిటీ ఇవ్వలేదు.

Also Read : Hero Prabhas : డార్లింగ్ ప్రభాస్ పోస్ట్ తో షాక్ అయిన ఫ్యాన్స్

Hero NikhilMeetUpdatesViral
Comments (0)
Add Comment