Hero Nikhil : దర్శకుడు సుధీర్ వర్మతో హ్యాట్రిక్ చిత్రానికి టైటిల్ ఇదే..

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్ 32వ చిత్రంగా....

Hero Nikhil : హీరో నిఖిల్ వరుస చిత్రాలతో దూసుకెళుతున్నారు. ‘ కార్తికేయ 2’చిత్రంతో నేష‌నల్ రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘స్వయంభూ’ చిత్ర షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతుండగా.. మరో వైపు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌లో నిఖిల్(Hero Nikhil) పూర్తి చేసిన సినిమా టైటిల్‌ని ఆదివారం రివీల్ చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌లో.. వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు ‘స్వామి రారా, కేశవ’ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమా ఇది.

Hero Nikhil Movies Update

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్ 32వ చిత్రంగా.. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన సీనియ‌ర్ నిర్మాత బి. వి. ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo)’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ‘ బొమ్మరిల్లు’ సినిమాలోని ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే పాట ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ పాట లిరిక్‌నే ఇప్పుడీ సినిమాకు టైటిల్‌గా పెట్టడం విశేషం. ఇక ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే హీరో నిఖిల్, హీరోయిన్ రుక్మిణి వ‌సంత్ న‌డుస్తూ వ‌స్తున్నారు. నిఖిల్ స్టైలిష్‌గా ఉంటే, రుక్మిణి వ‌సంత్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటున్నారు. ఈ ఫ‌స్ట్ లుక్ సినిమాపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది.

‘స్వామిరారా, కేశ‌వ’ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల త‌ర్వాత నిఖిల్(Hero Nikhil), సుధీర్ వ‌ర్మ క‌ల‌యిక‌లో రాబోతున్న సినిమా కావ‌టంతో ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ హిట్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావ‌టంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. ‘ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూద్దాం. క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో మంచి పాపుల‌ర్ హీరోయిన్‌గా అంద‌రినీ అల‌రిస్తోన్న రుక్మిణి వ‌సంత్.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో డైరెక్ట్‌గా తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మ‌రో బ్యూటీ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. హ‌ర్ష చెముడు ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది దీపావ‌ళికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మేకర్స్ ప్రకటించారు.

Also Read : Producer Vinod : ప్రకాష్ రాజ్ ట్వీట్ పై దుయ్యబట్టిన నిర్మాత వినోద్

MoviesNikhil SiddharthaRukmini VasanthTrendingUpdatesViral
Comments (0)
Add Comment