Hero Nani : నేను లేనుగా జెర్సీ 2 కష్టమే- హీరో నాని

ఇటీవ‌ల ఆ ఒక్కటి అడ‌క్కు ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు అల్లరి న‌రేష్ సినిమాకి ముఖ్య అతిథిగా విచ్చేశారు...

Hero Nani : నాని శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన ‘జెర్సీ’ ఎమోషనల్‌ డ్రామా. ఈ సినిమా నాని కెరీర్‌లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా క్లాసిక్ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇటీవలే మళ్లీ విడుదలై పాజిటివ్ రివ్యూలను అందుకుంది. ఈ చిత్రంలో నాని నటనకు అప్పట్లో చాలా ప్రశంసలు అందాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ హిందీలో కూడా రీమేక్ చేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా అని నాని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నాని ఈ సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Hero Nani Comment

ఇటీవ‌ల ఆ ఒక్కటి అడ‌క్కు ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌కు అల్లరి న‌రేష్ సినిమాకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో వేదికపై నాని(Hero Nani) మాట్లాడుతు.. “నేను లేనుగా ‘జెర్సీ 2’ సినిమా ఎవరితో తీసుకుంటారో తీసుకోండి” అని బదులిచ్చారు . చాలా ఎమోషనల్ డ్రామాగా సాగే జెర్సీ సినిమా క్లైమాక్స్‌లో నాని పాత్ర చనిపోవడం మనందరికీ తెలిసిందే. దాంతో నాని సీక్వెల్ చేయలేక పోవడంతో నాని “ఓకే..మీకు నచ్చిన వారితో తీయండి” అని అన్నారు.

నిజంగా జెర్సీ 2 తీస్తే నాని కొడుకు పాత్రలో నటించిన హరీష్ కళ్యాణ్ తో తీయాలి. మరి జెర్సీ 2 వస్తుందా? మరి హరీష్‌ కళ్యాణ్‌తో ఇంత సూపర్‌హిట్‌ సినిమా తీస్తాడో లేదో దర్శకుడు గౌతమ్‌తో పాటు దర్శక నిర్మాతలకే తెలియాలి. అయితే ఈ సీక్వెల్స్‌లో ఈ సినిమాకి సీక్వెల్‌ వస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఉండాల్సిందే.

Also Read : Suriya Jyothika: పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా వస్తున్న సూర్య-జ్యోతిక !

CommentsHero NaniJerseyTrendingViral
Comments (0)
Add Comment