Hero Nani : ఆ సినిమా మిస్ అయినా ‘సరిపోదా శనివారం’ బ్యాలెన్స్ చేసింది

ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. 15 రోజులుగా టీంలో ఎవరికీ నిద్రలేదు...

Hero Nani : నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్‌తో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళుతోంది. చిత్ర ఘన విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు.

Hero Nani Movie Success Meet

ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. 15 రోజులుగా టీంలో ఎవరికీ నిద్రలేదు. అప్పుడు పని చేసే ఒత్తిడితో నిద్ర లేదు. ఈ మూడు రోజులు‌గా సక్సెస్ ఎక్సయిట్‌మెంట్‌తో నిద్రలేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. సినిమాని మీరంతా ఆదరిస్తారని తెలుసు. థియేటర్‌లో అందరితో కలిసి ఆడియన్స్ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువగా అంచనా వేశామనిపించింది. సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి ప్రూవ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంత వర్షంలో కూడా అన్నీ చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే వి హేవ్ గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ది వరల్డ్. ఆడియన్స్ అందరికీ థాంక్స్. మా టీం అందరి తరపున ఆడియన్స్‌కి థాంక్స్ చెప్పడానికి కలిశాం.

‘సరిపోదా శనివారం’ నాట్ వీకెండ్ ఫిల్మ్.. ‘సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)’ హియర్ ఫర్ లాంగ్ కాల్. లాంగ్ రన్ వుండబోతోంది. హెవీ రైన్స్ వుండి ఈ వీకెండ్ చూడలేకపోతే ఎలా అని భయపడకండి, సినిమా మీ చుట్టే వుంటుంది. మీ దగ్గరలోనే వుంటుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడండి. చాలా స్పెషల్ అనుభవాన్ని ఇచ్చే మూవీ ఇది. సాయి కుమార్, శివాజీ రాజా గారు చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక సోల్ యాడ్ చేశారు. బాయ్స్‌కి ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

మీ అందరికి కంటే ముందు సెట్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌ని ఎంజాయ్ చేశాను. ఆయనకి బిగ్ థాంక్స్, వివేక్ విషయంలో చాలా ప్రౌడ్‌గా వుంది. ‘ అంటే సుందరానికీ’ రావాల్సిన బాక్సాఫీసు సక్సెస్ రాలేదనే చిన్న వెలితి వుండేది. అది కాస్త ఈ సినిమాతో బ్యాలెన్స్ అయిపొయింది. దానయ్య గారితో రెండో సినిమా ఇది. ‘ నిన్ను కోరి’ చాలా స్పెషల్ మూవీ. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’. నెక్స్ట్ టైం సినిమా చేసినప్పుడు అంచనాలు ఎక్కువగా వుంటాయి. అలాంటి సెటప్పే చేద్దాం. గట్టిగా కొడదాం. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. సెప్టెంబర్ 5న ‘సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ వుంటుంది. ఈ శనివారంతో సరిపోదు నెక్స్ట్ శనివారం..నెక్స్ట్ శనివారం అలా వెళుతూనే వుంటుంది. థాంక్యూ ఆల్.. అని అన్నారు.

Also Read : Harish Shankar : ‘గబ్బర్ సింగ్’ సినిమా మరో పుష్కర కాలం తర్వాత వచ్చిన క్రేజ్ తగ్గేదెలే..

CommentHero NaniSaripodhaa SanivaaramTrendingUpdatesViral
Comments (0)
Add Comment