Hero Nani : వరుస ఆఫర్లతో కన్ఫ్యూజ్ అవుతున్న నేచురల్ స్టార్

ఈ క్రమంలో నాని తదుపరి ప్రాజెక్ట్‌పై గందరగోళం నెలకొంది

Hero Nani : నేను కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు కన్ఫ్యూజ్ అంటున్నాడు నాని(Nani). బహుశా ఏడాదికి రెండు సినిమాలు సులువుగా చేసే హీరోని పట్టుకుని అలా అనొచ్చు. కానీ మనం ఏమి చేయగలం? అతను తీరు ఆలా ఉంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా సగం షూట్ అయిపోయినా నెక్ట్స్ ఏంటో చెప్పడం లేదు. మరి అతని తదుపరి సినిమా ఏంటి? చంద్రబోస్ ఈ పాట రాసినప్పుడు బాగా సూట్ అవుతుందని అనుకున్నాడా?

Hero Nani Movie Updates

ప్రస్తుతం కెరీర్‌లో ఈ పాట సరైనది. ఒక సినిమా చేసేటప్పుడు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది దర్శకులను లైన్ లో పెడుతుంటారు నాని. కానీ చాలా రోజుల తర్వాత అయోమయంలో పడ్డాడు. చాలా ఆఫర్ లు ఉన్నాయి, కానీ నేచురల్ స్టార్ ఏది నిర్ణయించడంలేదు.నాని(Nani) ప్రస్తుతం సరిపోదా చిత్రంలో నటిస్తున్నాడు, ఇది శనివారంతో రెండు మేజర్ షెడ్యూల్స్ ని ముగించింది. దర్శకుడు వివేక్ ఆత్రేయ అంచనా ప్రకారం రెండు నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది.

ఈ క్రమంలో నాని తదుపరి ప్రాజెక్ట్‌పై గందరగోళం నెలకొంది. త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అది ఎప్పుడు అయ్యేది కాదు. ఇదిలా ఉంటే ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఒదెరా స్క్రిప్ట్ సిద్ధం చేయడం మొదలుపెట్టాడు.తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి గత చిత్రం బడ్జెట్‌తో ఆగిపోయింది. ప్రస్తుతం ముందు ఉన్న ఏకైక ఆప్షన్ వేణు. అతను ‘బలగం’ సినిమాతో మంచి పేరుతెచ్చుకున్నాడు. అతని నాని కోసం ఓ కథ సిద్ధం చేశారు.శనివారం తర్వాత నాని చేయబోయే సినిమా ఇదే అన్న సంగతి తెలిసిందే. మరి నాని, వేణు కలిసి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారో చూడాలి.

Also Read : Kalki 2898 AD updates : డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్ట్రాటజీకి ఆశ్చర్యపోతున్న డార్లింగ్ ఫ్యాన్స్

BreakingHero NaniMoviesTrendingUpdates
Comments (0)
Add Comment