Hero Nani : నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ ‘దసరా’ తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత సుధాకర్ చెరుకూరితో మళ్లీ చేతులు కలిపారు. NaniOdela2 చిత్రంగా ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి బుధవారం టైటిల్ అనౌన్స్ చేశారు. నాని ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ని రివీల్ చేశారు. ‘ది పారడైజ్’ అనే పవర్ ఫుల్ టైటిల్‌తో నాని(Hero Nani), శ్రీకాంత్ ఓదెల మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లుగా ఈ స్టన్నింగ్ పోస్టర్ తెలియజేస్తోంది.
Hero Nani Movies Update
‘దసరా’కి 100 రెట్లు ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు నాని ఇటీవలే చెప్పిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ లుక్ చూస్తుంటే అది నిజమే అని అంగీకరించకతప్పదు. ఎందుకంటే ఈ టైటిల్ లుక్ పోస్టర్ అలాంటి ఇంపాక్ట్‌ని కలగజేస్తుంది. చార్మినార్‌తో పాటు గన్స్‌ని మిళితం చేస్తూ.. టైటిల్ లుక్‌ని ఎంతో సృజనాత్మకంగా డిజైన్ చేశారు. నాని కూడా ‘యస్.. ది పారడైజ్.. శ్రీకాంత్ ఓదెల ఫిల్మ్’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం టైటిల్ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది.
నాని, శ్రీకాంత్ కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడం, హ్యుజ్ పాపులారిటీని సాధించడంతో.. ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడాయి. దసరా శుభ సందర్భంగా ఈ సినిమాని గ్రాండ్‌గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో నానిని ప్రెజెంట్ చేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే, లార్జర్ దెన్ లైఫ్ కథని రూపొందించినట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. పాషనేట్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నానికి మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ సినిమా కానుంది.
Also Read : Prashanth Neel : మరోసారి మనసు మార్చుకున్న కెజిఎఫ్ డైరెక్టర్ నీల్