Hero Naga Shaurya : యంగ్ హీరో నాగ శౌర్య తన నూతన చిత్ర షూటింగ్‌ని మొదలెట్టారు. రామ్ దేశిన (రమేష్) ఈ చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇది శౌర్య కెరీర్‌లోనే హై-బడ్జెట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కబోతోంది. యూనివర్సల్ అప్పీల్ వున్న కథతో రూపొందుతోన్న ఈ మూవీ బిగ్ హిట్‌తో పాటు శౌర్య(Hero Naga Shaurya)కు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Hero Naga Shaurya Movies
సినిమా నిర్మాణంపై పాషన్ ఉన్న బిజినెస్ మ్యాన్ చింతలపూడి శ్రీనివాసరావు క్యాలిటీ చిత్రాలను నిర్మించి కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకురావాలనే తపనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, దర్శకుడు రమేష్ చెప్పిన కథ తనని మెస్మరైజ్ చేసిందని, అందుకే ఈ సినిమాను హై బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లుగా వెల్లడించారు. దర్శకుడు రమేష్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పనిచేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన సహ రచయితగా పనిచేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్ లతో సహా ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.
Also Read : AR Rahman Daughter : తండ్రి బాటలో నడుస్తున్న ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ‘ఖతీజా’