Hero Naga Chaitanya : అక్కినేని యువ కథానాయకుడు నాగ చైతన్య ఎన్నో సినిమాల్లో నటించి హిట్లు, పరాజయాలు చవిచూశారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాగ చైతన్య ఇప్పుడు ‘తండేళ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది పక్కన పెడితే స్టార్ హీరోయిన్ సమంతను నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విడిపోవడంతో చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. విడిపోయిన తర్వాత ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య ప్రపోజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hero Naga Chaitanya Video Viral
చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ‘తండేళ్’ చిత్రంలో నటిస్తున్నాడు. మత్యకారుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగ చైతన్య(Naga Chaitanya) రఫ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్ప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాయి పల్లవికి నాగ చైతన్య చెప్పిన డైలాగ్ వీడియోకు హైలైట్.
బుజ్జి తల్లి..వచ్చేస్తున్నా కదే..కాస్త నవ్వవే అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా కదిలించింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా నాగ చైతన్య ఓ క్రేజీ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో నాగ చైతన్య మళ్లీ కనిపించాడు. బుజ్జి తల్లి..వచ్చేస్తున్నా కదే..కాస్త నవ్వవే అంటూ వాలెంటైన్స్ డే విషెస్ తలియజేసారు. ఈ వీడియోలో సాయి పల్లవి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తండేళ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌లు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read : Bandla Ganesh Case : నిర్మాత బండ్ల గణేష్ కు చుక్కెదురు..సంవత్సరం జైలు శిక్ష, జరిమానా..