Hero Mohanlal: ప్రయోగాత్మక కథలు… వైవిధ్యమైన పాత్రలు… విభిన్నమైన గెటప్స్‌ను ఎంచుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్. మన్యంపులి, జనతా గ్యారేజ్, ఇటీవల జైలర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన లిజో జోష్ పెల్లిస్సేరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘మలైకోట్టై వాలిబన్’ సినిమాలో నటిస్తున్నారు. మోహన్ లాల్ సరసన సోనాలి కులకర్ణి నటిస్తుంది. షిబు బేబి జాన్ నిర్మాతగా పిరియాడికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal)… రెజ్లర్ పాత్రలో కనిపించనున్నారు.
Hero Mohanlal Movie Updates
ఇటీవల విడుదలైన ‘మలైకోట్టై వాలిబన్’ సినిమా టీజర్, పోస్టర్లు, పాటలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రానుంది. ఈ సందర్భంగా ఇప్పటినుంచే సినిమా ప్రమోషన్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్. క్రిస్మస్ సందర్భంగా సినిమాలోని కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. చుట్టూ ప్రజలు… మధ్యలో మోహన్‌లాల్… ఉన్న ఆ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో రెజ్లర్ పాత్రలో కనిపిస్తున్న మోహన్ లాల్ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలను అమాంతంగా పెరిగిపోతున్నాయి.
Also Read : Comedian Neel Nanda: ప్రముఖ హాలీవుడ్ స్టాండప్ కమెడియన్ మృతి