Hero Mahesh : తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన మహేష్ బాబు

రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా....

Hero Mahesh : ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ప్రకటిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.

Hero Mahesh Donates..

‘‘రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా.. నేను ఏపీ మరియు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల చొప్పున ఒక్కొక్కరికి విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి మరియు పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి, మరింత బలంగా ఎదగాలి..’’ అని మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ వైరల్ అవుతోంది. అభిమానులు, ప్రేక్షకులు మహేష్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : Nayanthara: యశ్‌ ‘టాక్సిక్‌’ కోసం రంగంలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార!

DonationsMahesh BabuTrendingUpdatesViral
Comments (0)
Add Comment