Hero Mahesh Babu : ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్

మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు...

Hero Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఏదైనా సినిమా నచ్చితే.. వెంటనే ఆ సినిమా యూనిట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తారనే విషయం తెలిసిందే. ఇంతకు చాలా సినిమాల విషయంలో ఆయన నచ్చిన సినిమాలకు తన రివ్యూని ఇస్తూ వచ్చారు. ఇప్పుడా లిస్ట్‌లోకి రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ కూడా చేరింది. తొలిసారి రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇటువంటి వినోదాత్మక సినిమా తీసినందుకు ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్ర బృందాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు(Hero Mahesh Babu) అభినందించారు. చిత్ర బృందం మీద ప్రశంసలు కురిపించారు.

Hero Mahesh Babu Appreciates

మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Hero Mahesh Babu) ఎప్పుడూ ఓ అడుగు ముందుంటారు. సినిమాలో ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు కూడా మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రాల్లో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఒకటని సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు. ‘ హిలేరియస్ రైడ్’ అంటూ సినిమాకు షార్ట్ అండ్ స్వీట్ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. తన ట్వీట్‌లో సమర్పకురాలు తబితా సుకుమార్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

మహేష్ ట్వీట్ చూస్తే… ఆయన సినిమాను చాలా ఎంజాయ్ చేసినట్టు అర్థం అవుతోంది. ఆయన ప్రశంసలతో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్ర బృందం అమితానందంలో ఉంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తబితా సుకుమార్ సమర్పణలో విడుదలైంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరం సైతం ఈ సినిమాను ఎంజాయ్ చేస్తోంది. థియేటర్లలో నవ్వుల పండగ స్పష్టంగా కనబడుతోంది. ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున విడుదల చేసింది.

Also Read : Mahesh Babu: సుకుమార్ భార్యను ప్రశంసలతో ముంచెత్తిన మహేశ్ బాబు !

CinemaMahesh BabuMaruthi Nagar SubramanyamTrendingUpdatesViral
Comments (0)
Add Comment