Gautham Menon : తమిళ సినీ రంగంలో అత్యంత జనాదరణ పొందిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్(Gautham Menon). తను తీసిన ఏమాయ చేశావే సూపర్ డూపర్ హిట్ . అంతే కాదు భారతీయ సినీ చరిత్రలో క్లాసికల్ మూవీస్ లో ఒకటిగా ఆ మూవీ నిలిచి పోయింది. అందులో నేషనల్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు, నాగ చైతన్య కలిసి నటించారు. తనను గౌతమ్ వాసుదేవ మీనన్ పరిచయం చేశాడు సినీ రంగానికి . ఇలా ఎందరినో సినీ రంగంలోకి తీసుకు వచ్చాడు. తన టేకింగ్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మధ్యన షాకింగ్ కామెంట్స్ చేశాడు సినీ రంగం గురించి.
Gautham Menon – Karthi Combination
మనం లైమ్ లైట్ లో ఉన్నప్పుడే అందరూ పలకరిస్తారని ఆ తర్వాత లేకపోతే తమ గురించి ఎవరూ పట్టించు కోరంటూ వాపోయాడు. దీనిపై పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. తనకు మేమందరం ఉన్నామంటూ సపోర్ట్ కూడా ప్రకటించారు. సోషల్ మీడియాలో అప్పట్లో మీనన్ సంచలనంగా మారారు. సినిమా రంగానికి సంబంధించి 24 ఫ్రేమ్స్ గురించి తెలిసిన దర్శకులలో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం తర్వాత గౌతమ్ వాసుదేవ మీనన్ మాత్రమేనని చెప్పక తప్పదు.
తాజాగా తనకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ కూడా వచ్చింది. అదేమిటంటే ఇప్పటికే స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు అన్నదమ్ములు. ఒకరు సూర్య కాగా మరొకరు కార్తీ(Karthi). తను ఆ మధ్యన మణిరత్నం మూవీలో నటించి మెప్పించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. మరో వైపు గౌతమ్ వాసుదేవ మీనన్ సినిమాలు లేక పోవడంతో దళపతి విజయ్ తో కలిసి పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. తాజాగా తను చెప్పిన కథకు ఫిదా అయ్యానని తెలిపాడు నటుడు కార్తీ. తను మీనన్ కు ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. దీంతో అభిమానులు ఈ ఇద్దరి మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
Also Read : Hero Nithin Special Song :నితిన్ కోసమే స్పెషల్ సాంగ్ చేశా