Hero Kalyanram: ‘డెవిల్‌’ కు డేట్‌ ఫిక్స్‌ చేసిన కళ్యాణ్ రామ్

‘డెవిల్‌’ కు డేట్‌ ఫిక్స్‌ చేసిన కళ్యాణ్ రామ్

Hero Kalyanram: అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా సినిమా ‘డెవిల్‌’. కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటించగా… హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్ స్పై థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబందించి విడుదల చేసిన టీజర్, మాయ చేసావే అనే ఫస్ట్ సింగిల్, డ్యాన్స్‌ డ్యాన్స్‌ దిస్‌ ఈజ్‌ లేడీ రోజీ అనే సెకండ్ సింగిల్ కు మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు నిర్మాణ సంస్థ డేట్ ఫిక్స్ చేసింది.

Hero Kalyanram – డిసెంబరు 29న వస్తున్న ‘డెవిల్‌’

స్వాతంత్య్రానికి పూర్వం మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్ స్పై థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్… ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ తరువాత ‘అమిగోస్’ తో ప్రేక్షకులను నిరాశపరచిన కళ్యాణ్ రామ్(Kalyanram)… ‘డెవిల్‌’ పై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను డిసెంబరు 29న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో 2023వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ… 2024లో ‘డెవిల్‌’ మంచి హిట్ కొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్‌తో ‘‘డ్యాన్స్‌ డ్యాన్స్‌ మళ్లీ కొత్తగా.. డ్యాన్స్‌ డ్యాన్స్‌ కొంచెం మత్తుగా.. డ్యాన్స్‌ డ్యాన్స్‌ దిస్‌ ఈజ్‌ లేడీ రోజీ’’ అంటూ కళ్యాణ్ రామ్ వేసిన స్టెప్పులకు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ‘జవాన్’ టైటిల్ తో ఆకట్టుకున్న లేటెస్ట్ సింగింగ్ సన్సేషన్ రాజకుమారి ఈ పాటను ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా… కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Also Read : Tamannaah Bhatia: మరో ఐటెం సాంగ్ కు మిల్క్ బ్యూటీ రెడీ

devilKalyan Ram
Comments (0)
Add Comment