Hero Kalyan Ram: ‘డెవిల్‌ పార్ట్‌ 2’ అనౌన్స్‌ చేసిన కళ్యాణ్ రామ్

‘డెవిల్‌ పార్ట్‌ 2’ అనౌన్స్‌ చేసిన కళ్యాణ్ రామ్

Hero Kalyan Ram: అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా రూపొందించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘డెవిల్‌’. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా… పీరియాడిక్ జోనర్‌లో స్పై, యాక్షన్, థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. కళ్యాణ్ రామ్ నటన సినిమాలకు హైలెట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో తాజాగా ‘డెవిల్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు టీమ్‌ వర్క్‌తోనే ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించడం సాధ్యమైందన్నారు.

Hero Kalyan Ram Movie Updates

అనంతరం ఆయన ‘డెవిల్‌’ సినిమా గురించి మాట్లాడుతూ… ‘‘డెవిల్‌ 2’ చేయాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. కారైకుడిలో ‘డెవిల్‌’ షూట్‌ చేస్తున్నప్పుడు కథా రచయిత శ్రీకాంత్‌ విస్సా ‘డెవిల్‌ 2’ ఐడియా చెప్పారు. నాకెంతో ఆసక్తిగా అనిపించింది. 2024-25లో ఈ ప్రాజెక్ట్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో 1940తోపాటు ప్రస్తుతం ఉన్న కాలాన్ని కూడా చూపించనున్నాం’’ అని చెప్పారు. 1940 ద‌శ‌కంలో జ‌రిగే క‌ల్పిత క‌థతో పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కించారు ‘డెవిల్‌’. బ్రిటిష్ ప్ర‌భుత్వంలో సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసే డెవిల్‌ పాత్రలో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను మెప్పించారు.

Also Read : Thalapathy Vijay: ద‌ళ‌ప‌తి విజ‌య్‌పై చెప్పుతో దాడి ?

devilKalyan Ram
Comments (0)
Add Comment