Hero Jr NTR: టాలీవుడ్ టాప్ హీరోల్లో రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ స్నేహం గురించి పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. పెళ్ళి తరువాత కూడా వారిద్దరూ ఎంత స్నేహంగా ఉంటారో పలు సందర్భాల్లో ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లతో చాలా స్పష్టంగా చెప్పారు. చాలా సంవత్సరాలుగా వారి మధ్య ఉన్న స్నేహ బంధం ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత సోదర బంధంగా మారిందని… జన్మ జన్మలకు కూడా ఈ బంధం ఇలాగే కొనసాగించాలంటూ బహిరంగ వేదికలపై ఇద్దరూ ఆకాంక్షించారు. అంతేకాదు ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే… ఇంట్లో వాళ్ల కళ్లు గప్పి… ఎలా బయటికి చెక్కేస్తారో కూడా వివరించారు. పెళ్ళైన పదేళ్ళ తరువాత తండ్రి కాబోతున్న సమయంలో చరణ్… ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ముందే… మొదట ఎన్టీఆర్ కి ఫోన్ చేసి తన ఆనందాన్ని షేర్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెర్రీ చెప్పాడు.
Hero Jr NTR Special Gift to Ram Charan Daughter
పెళ్లైన 10ఏళ్ల తరువాత రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పటికే మెగా మనుమరాలుకు క్లీంకార అని పేరు పెట్టగా… మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి భారీగా బహుమతులు అందాయి. అందులో భాగంగగానే జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట. అంతేకాదు ఆ గిఫ్ట్ కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది. చరణ్, ఉపాసన, క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది. దీనితో చరణ్-తారక్ స్నేహ బంధం గురించి తెలిసిన వారు ఈ ప్రచారం నిజమే అంటున్నారు.
Also Read : Salaar Part 2: ‘సలార్ పార్ట్ 2’ రిలీజ్ డేట్ చెప్పిన నిర్మాత !