Emraan Hashmi : షూటింగ్ లో గాయపడ్డ ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్

గూఢచారి 2 చిత్రంలో ఇమ్రాన్ జంప్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు...

Emraan Hashmi : బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రస్తుతం దక్షిణాదిలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇన్నాళ్లు హిందీ చిత్రపరిశ్రమలో స్టా్ర్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఇమ్రాన్.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ముందుకు ప్రతినాయకుడిగా వస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు ఇమ్రాన్(Emraan Hashmi). ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా కాకుండా గూడాచారి 2’లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా అతడి మెడకు తీవ్ర గాయమైంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Emraan Hashmi Health…

గూఢచారి 2 చిత్రంలో ఇమ్రాన్ జంప్ చేసే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ లో పైనుంచి దూకుతుండగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో అతడి మెడపై తీవ్ర గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం షూటింగ్ కొనసాగించాడు. అయితే గాయం కాగానే.. చిన్నగా తగిలిందని ఇమ్రాన్(Emraan Hashmi) షూటింగ్ కంటిన్యూ చేశాడని.. కానీ మెడ నుంచి రక్తం రావడంతో వెంటనే అప్రమత్తమైన చిత్రయూనిట్ ఆయనకు ప్రథమ చికిత్స అందించారని.. అనంతరం షూటింగ్ కంప్లీట్ చేశాడని సమాచారం.

ఒకవేళ తాను ఆసుపత్రిలో చేరితే లేదా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటే, సినిమా పని ఆలస్యం అవుతుందని.. అందుకే ఇమ్రాన్ ప్రథమ చికిత్స వెంటనే షూట్ కంప్లీట్ చేశారని అన్నాడు. కానీ ఇమ్రాన్ హెల్త్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. వినయ్ కుమార్ దర్శకత్వంలో ‘గూడాచారి 2’ రూపొందుతోంది. దర్శకుడిగా ఇది ఆయనకు మొదటి సినిమా. తెలుగులో హిట్ అయిన అడివి శేష్ ‘గూడాచారి’కి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇమ్రాన్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శోభితా ధూళిపాళ కథానాయికగా నటిస్తుండగా, జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ గతంలో ‘టైగర్ 3’ సినిమాలో విలన్‌గా నటించాడు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తదితరులు నటించారు.

Also Read : Bobby Deol : తమిళ హీరో విజయ్ సినిమాలో యానిమల్ విలన్ బాబీ డియోల్

BreakingEmraan HashmiHealth ProblemsUpdatesViral
Comments (0)
Add Comment