Hero Dhanush : ముగింపు దశకు వచ్చిన ధనుష్, నిర్మాతల మధ్య పంచాయితీ

ఈ వ్యవహారం చర్చకు వచ్చినపుడల్లా ధనుష్‌ పేరు తెరపైకి వస్తుంది...

Hero Dhanush : చాలాకాలంగా సాగుతున్న హీరో ధనుష్‌ సినీ పంచాయితీకి త్వరలోనే తెరపడనుంది. తమిళ చిత్రపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతకు, తనకు మధ్య తలెత్తిన సమస్యకు పరిష్కారానికి హీరో ధనుష్‌ ముందుకు వచ్చారు. ఈ నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్వాగతిస్తున్నారు. కోలీవుడ్‌ నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్న తేనాండాళ్‌ పిక్చర్స్‌ అధినేత రామస్వామి ఎన్‌ మురళి నిర్మాతగా.. ధనుష్‌(Hero Dhanush) హీరోగా ఒక చిత్రం కొన్నేళ్ల క్రితం ప్రారంభమైంది. కొద్దిగా షూట్‌ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టు అటకెక్కింది. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయిన నిర్మాత మురళి.. నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఇటీవల సమావేశమైన నిర్మాతల మండలి.. నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుని డేట్స్‌ ఇవ్వని హీరోలపై చర్యలు (రెడ్‌కార్డ్‌) తీసుకునేలా తీర్మానం చేసింది. ఇలాంటివారిలో హీరో ధనుష్‌ కూడా ఉన్నారు.

Hero Dhanush…

ఈ వ్యవహారం చర్చకు వచ్చినపుడల్లా ధనుష్‌ పేరు తెరపైకి వస్తుంది. దీంతో ఈ సమస్య పరిష్కారానికి ధనుష్‌.. తేనాండాల్‌ పిక్చర్స్‌ ప్రతినిధులతో చర్చించినట్టు సమాచారం. అయితే, తొలుత అనుకున్న కథను కాకుండా, మరో కొత్త కథతో సినిమా తీస్తే తాను నటించేందుకు సిద్ధమని ధనుష్‌ హామీ ఇచ్చినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చర్చలు ఫలిస్తే, ధనుష్‌ – నిర్మాత మురళి మధ్య వివాదానికి శుభంకార్డు పడినట్టే. ధనుష్ విషయానికి వస్తే.. ఆయన హీరోగా నటించిన 50వ చిత్రం ‘రాయన్’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ కీలక పాత్రలలో నటించారు. ‘ రాయన్’ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో సైతం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా అనంతరం ప్రస్తుతం ధనుష్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు.

Also Read : Hero Chiranjeevi : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు తప్పనిసరి అయితే బయటకు రావొద్దు

CommentsdhanushUpdatesViral
Comments (0)
Add Comment