Hero Dhanush: మాఫియా లీడర్ గా ధనుష్‌ ?

మాఫియా లీడర్ గా ధనుష్‌ ?

Hero Dhanush: సున్నితమైన భావోద్వేగాలు నిండిన కథలతో ప్రేక్షకులను ఆకట్టకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలు శేఖర్ కమ్ముల సున్నితమైన భావోద్వాగాలకు నిదర్శనంగా నిలుస్తాయి. లీడర్, నేనే రాజు నేనే మంత్రి వంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను శేఖర్ కమ్ముల చేసినప్పటికీ… మంచి కాఫీ లాంటి సినిమాలు తీయడం ఆయనకు ఆయనే సాటి. అలాంటి శేఖర్ కమ్ముల తాజాగా తమిళ అగ్రహీరో ధనుష్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.

Hero Dhanush – శేఖర్ కమ్ముల శైలికి భిన్నంగా ‘ధనుష్‌ 51’ సినిమా

సున్నితమైన భావోద్వేగాలను పండించే శేఖర్ కమ్ముల… మొదటి సారిగా తన శైలికి భిన్నంగా మాఫియా నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ధనుష్‌ 51’ వర్కింగ్ టైటిల్ తో త్వరలో ప్రారంభించబోయే ఈ సినిమాలో తమిళ అగ్ర హీరో ధనుష్(Dhanush) ను మాఫియా లీడర్ గా చూపించబోతున్నట్లు సమాచారం. మాఫియా నేపథ్యంలో సాగే కథ కావటంతో ఈ సినిమాను కూడా ముంబయిలోనే ఎక్కవ శాతం చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Sai Pallavi: ‘కేజీఎఫ్‌’ హీరోకు జోడిగా సాయి పల్లవి ?

dhanushsekhar kammula
Comments (0)
Add Comment