Hero Chiranjeevi : ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సంస్థ సిఈఓ టెడ్ సరండోస్… మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) భేటీ అయ్యారు. శుక్రవారం తన సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్లిన టెడ్ సరండోస్… ఆయనతో పాటు రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తో కూడా కలిసి మాట్లాడటమే కాకుండా సెల్ఫీలు దిగుతూ సందడి చేసారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ…. పలు ఇండియన్ నాన్ వెజ్ వంటకాలను టెడ్ కి రుచి చూపించినట్టు సమాచారం. అయితే టెడ్-మెగాస్టార్(Mega Star) ల భేటీ స్నేహపూర్వకమైన కలయిక అని బయటకు చెప్తున్నప్పటికీ… నెట్ ఫ్లిక్స్ సంస్థ తన మార్కెట్ ను ఇండియాలో పెంచేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇండియా టూర్ లో ఉన్న నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్… తన వ్యాపార విస్తరణలో భాగంగా తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన పలువురు అగ్రహీరోలను, నిర్మాతలను కలిసే అవకాశం ఉందని టాక్.
Hero Chiranjeevi – ఆర్ఆర్ఆర్ కు నెట్ ఫ్లిక్స్ లో మిలియన్ల వ్యూస్
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు అస్కార్ అవార్డు వచ్చిన తరువాత వరల్డ్ వైడ్ అమోఘమైన స్పందన దక్కింది. ఆస్కార్ వచ్చాక మిలియన్ల వ్యూస్ వెల్లువలా నెట్ ఫ్లిక్స్ ఓటిటిని ముంచెత్తాయి. దీనితో పాటు వాల్తేర్ వీరయ్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లను సినిమా డిజిటల్ రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ కంపెనీ ప్యాన్సీ రేట్లకు సంపాదించింది. మైత్రి మూవీ మేకర్స్ సైతం అమెజాన్ ప్రైమ్ నుంచి షిఫ్ట్ అయిపోయి పుష్ప 2 కూడా నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ సిఈఓ టెడ్ … మెగా కుటుంబాన్ని కలిసినట్లు తెలుస్తోంది.
ఇండియాలో ఈ ఏడాది రూ. 800 కోట్ల పెట్టుబడి పెట్టిన నెట్ ఫ్లిక్స్
నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇండియాలో మార్కెట్ ని పెంచుకునేందుకు తీవ్ర ప్రణాళికలు వేస్తోంది. కేవలం తెలుగు తమిళ సినిమాల మీదే ఈ ఏడాది 800 కోట్లకు పైగా పెట్టుబడిని హక్కుల కోసం ఖర్చు పెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధిక పెద్ద చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లోనే వచ్చాయి. షూటింగ్ దశలో ఉండగానే భారీ ఆఫర్లు ఇచ్చి మరీ ఫ్యాన్సీ రేట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకునే ఎత్తుగడని నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం గత కొన్ని నెలలుగా చేస్తోంది. తాజాగా
ఒరిజినల్ కంటెంట్ సృష్టించే క్రమంలో భాగంగా ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు నిర్మించే ప్లాన్ లో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చరణ్, చిరులతో కొన్ని ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంకటేష్, రానాలతో ఆల్రెడీ రానా నాయుడు తీసిన నెట్ ఫ్లిక్స్ త్వరలో రెండో సీజన్ కి ప్లాన్ చేస్తోంది.
Also Read : Pawan Kalyan: సోషల్ సెటైర్‌గా పవన్ కల్యాణ్ సినిమా !