Hero Chiranjeevi : కుటుంబ సమేతంగా పారిస్ ఒలింపిక్స్ లో సందడి చేసిన చిరు

ఈరోజు చిరంజీవి లండన్ నుండి పారిస్ వెళ్లారు, అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ లో సందడి చేశారు...

Hero Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన కుటుంబంతో విహార యాత్రకి వెళ్లారు. కొన్ని రోజుల క్రితమే తన మనవరాలు క్లింకారా, భార్య, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసనతో లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈరోజు చిరంజీవి లండన్ నుండి పారిస్ వెళ్లారు, అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ లో సందడి చేశారు. ఒలింపిక్స్ టార్చ్ లాంటిదే ఒకటి తయారుచేసి అది ఒలింపిక్స్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల కోసం పెట్టారు. ఆ రెప్లికా ని పట్టుకొని, చిరంజీవి అతని భార్య సురేఖ పోజులు ఇచ్చారు. అలాగే ఒలింపిక్స్ లో భారత దేశం తరఫును ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు అందరికీ తన శుభాకాంక్షలు తెలియచేసారు చిరంజీవి.

Hero Chiranjeevi Family Tour

ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులు అందరూ ఎక్కువ పతకాలు గెలుచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మెడల్ టాలీని పెంచుతారాన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దీనికి మల్లిడి వసిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక ఫాంటసీ నేపథ్యంలో వచ్చే సినిమా. ఇందులో సుమారు ఆరుగురు కథానాయికలు వున్నారు, అందులో ప్రధాన పాత్ర త్రిష పోహిస్తోంది.

Also Read : Hero Vishal : దమ్ముంటే నన్ను ఆపండి అంటూ సవాల్ విసిరినా విశాల్

Megastar ChiranjeeviTrendingUpdatesViral
Comments (0)
Add Comment