Hero Chaitanya : అక్కినేని నాగార్జున తనయుడు నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇటీవలే శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా తన గురించి అప్ డేట్ ఇచ్చాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, తను నా లైఫ్ లో వెరీ వెరీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె స్వస్థలం విశాఖ అని , ఇక్కడి సముద్రం అంటే తనకు ఎంతగానో ఇష్టమన్నాడు. శోభిత సాంగత్యం తనకు మరింత సంతోషాన్ని కలిగించేలా చేస్తోందన్నాడు నాగ చైతన్య.
Hero Chaitanya Comment..
ఇదిలా ఉండగా తను నటించిన తండేల్ మూవీ వచ్చే నెల ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇందులో ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ గా వస్తోంది. గత ఏడాదిన్నర కాలం నుంచి దీనిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టానని చెప్పాడు నాగ చైతన్య(Hero Chaitanya). మనసు పెట్టి చేశాడనని, తన కెరీర్ లో తండేల్ మరిచి పోలేని చిత్రం అవుతుందని పేర్కొన్నాడు.
ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం చెప్పాడు. నిర్మాత అల్లు అరవింద్ అందించిన సహకారం తాను మరిచి పోలేనని అన్నాడు. ఈ సినిమా విషయంలో తను మెంటార్ గా ఉన్నాడని తెలిపాడు.
బన్నీ వాసు నిర్మించడగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు తండేల్ మూవీని. మత్స్యకారుల జీవితం నేపథ్యంగా దీనిని తెరకెక్కించాడు దర్శకుడు. విశాఖపట్నంలో చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.
Also Read : Hero Mahesh-Rajamouli : జక్కన్న రూటే సపరేటు