Hero Anand Deverakonda Movie : మరో కొత్త స్టోరీతో రానున్న ఆనంద్ దేవరకొండ ‘సితార 32’

ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి...

Anand Deverakonda : ‘బేబీ’ చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయం సాధించింది. ’90s’ వెబ్ సిరీస్ తో దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 32 చిత్రాన్ని ప్రకటించింది. మేరకు నిర్మాతలు అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. ’90s’ సిరీస్ లో చిన్న పిల్లవాడు ఆదిత్య పాత్ర ఎంతలా ప్రేక్షకుల మనసులను గెలుచుకుందో తెలిసిందే. ఆ పిల్లవాడు పది సంవత్సరాల తర్వాత పెద్దవాడైతే, ఆ పాత్రను ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) పోషిస్తే, అతనికి ఒక అందమైన ప్రేమ కథ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ చిత్ర కథ పుట్టినట్లుగా అనౌన్స్ మెంట్ వీడియోలో చూపించారు.

Anand Deverakonda Movie Updates

“మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ.” అంటూ వీడియో చివర్లో ఆనంద్ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందనుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి మరియు ’90s’ సిరీస్ లో తన అసాధారణ ప్రతిభతో ప్రశంసలు పొందిన ఛాయాగ్రాహకుడు అజీమ్ మొహమ్మద్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read : Hero Bunny-Pushpa 2 : మరో కొత్త స్ట్రాటజీతో రానున్న ‘పుష్ప 2’ టీమ్

Anand DeverakondaMoviesTrendingUpdates
Comments (0)
Add Comment