Hero Akhil : అక్కినేని అందగాడు నాగార్జున వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు అక్కినేని ఫ్యామిలి కలిసి నటించిన మనం సినిమాలో గెస్ట్‌గా నటించాడు. సినిమా చివరిలో ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత సోలో హీరోగా అఖిల్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత హలో అనే సినిమా చేశాడు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అఖిల్(Hero Akhil) నటన ఆకట్టుకున్నా సినిమా మాత్రం ఆడలేదు. ఆతర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఈ సినిమా హిట్ అఖిల్ ఫ్యాన్స్‌కు సరిపోలేదు.
Hero Akhil-Niharika….
చివరిగా ఏజెంట్ అనే పెద్ద షాక్ ఇచ్చాడు ఈ అక్కినేని జూనియర్ అందగాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే సినిమాల్లోకి రాకముందు అఖిల్ ఓ షార్ట్ ఫిలింలో నటించాడని చాలా మందికి తెలియదు. అవును అఖిల్ ఓ షార్ట్ ఫిలిం చేశాడు. అదికూడా మెగా హీరోయిన్‌తో ఆ హీరోయిన్ ఎవరో కాదు నిహారిక. అఖిల్, నిహారిక కలిసి ఓ షార్ట్ ఫిలిం చేశారు. గతంలో విశ్వక్ సేన్ తో ఒక షార్ట్ ఫిలిం చేసింది నిహారిక. కాలేజ్‌లో ఉండే సమయంలో విశ్వక్ సేన్‌తో సినిమా చేసింది.
అలాగే అఖిల్(Hero Akhil) తోనూ ఓ షార్ట్ ఫిలిం చేసింది. రీసెంట్‌గా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను అఖిల్ కలిసి ఓ షార్ట్ ఫిలిం చేశాం.. ఈ సినిమాకు కార్తికేయ దర్శకత్వం వహించాడు. ఆ షార్ట్ ఫిలిం సూపర్ అని చెప్పను కానీ పర్లేదు. ఈ షార్ట్ ఫిలింను రాజమౌళికి చూపిస్తే.. ఇది రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండు అని అన్నారట అని తెలిపింది. అలాగే విశ్వక్‌తో షార్ట్ ఫిలిం చేద్దాం అనుకున్నా కానీ.. అది చివరకు సాంగ్ అయ్యింది అని చెప్పుకొచ్చింది నిహారిక. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Also Read : Aishwarya Rajesh : తన మనసులో మాట వెల్లడించిన తమిళ భామ ఐశ్వర్య