Hero Ajith Kumar : కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 కూడా రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇక కేజీఎఫ్ యూనివర్స్ పక్కన పెట్టిన ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ థియేటర్లలో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సలార్ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. కొన్నిరోజులుగా సలార్ 2 వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా కేజీఎఫ్ 3 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Hero Ajith Kumar Movies Update
అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Hero Ajith Kumar) తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెండు సినిమాలు చేయబోతున్నారట. ఇందులో ఒక సినిమా పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని టాక్. అలాగే మరొక సినిమా రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ యూనివర్స్ కు లింక్ చేస్తుందని టాక్. అంటే కేజీఎఫ్ 3 కంటే ముందే అజిత్(Hero Ajith Kumar), నీల్ సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ నటించే సినిమా నుంచే కేజీఎఫ్ 3 కి లీడ్ తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్, అజిత్ కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది స్టార్ట్ చేసి 2026లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇప్పుడు అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో అజిత్ సినిమా అంటే ఇప్పుడే ఓ రేంజ్ అంచనాలు పెంచేసుకున్నారు ఫ్యాన్స్. తమిళ్ సినిమా రంగంలో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకునే హీరో అజిత్. ప్రస్తుతం విదా ముయార్చి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్ వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ తో అజిత్ సినిమా అంటే బ్లాస్ట్ అవ్వడం ఖాయమంటూ సోషల్ మీడియాలో అజిత్ ట్యాగ్ తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read : Anasuya : ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు చేయడం అదృష్టం అంటున్న అనసూయ