Hero Ajith Feels : మా నాన్న బ‌తికుంటే బాగుండేది

న‌టుడు అజిత్ కుమార్ భావోద్వేగం

Hero Ajith : కేంద్ర ప్ర‌భుత్వం అరుదైన, అత్యున్న‌త‌మైన ప‌ద్మ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది కోలీవుడ్ సూప‌ర్ స్టార్ అజిత్ కుమార్ కు. ఆయ‌న‌తో పాటు ద‌క్షిణాదికి చెందిన నటులు శోభ‌న‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనంత నాగ్ ల‌కు కూడా ప‌ద్మాల‌కు ఎంపిక చేసింది. మొత్తం 139 అవార్డుల‌ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు అధికారికంగా వెల్ల‌డించింది.

Hero Ajith Kumar Feels…

ఈ సంద‌ర్బంగా త‌న‌కు దేశంలోనే అత్యున్న‌త‌మైన ప‌ద్మ భూష‌ణ్ అవార్డుకు ఎంపిక చేయ‌డం ప‌ట్ల న‌రేంద్ర మోడీ కేంద్ర స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు న‌టుడు అజిత్ కుమార్(Hero Ajith). త‌ను ఏరికోరి న‌టి షాలినిని పెళ్లి చేసుకున్నారు. త‌న‌కు సినిమా అంటే పిచ్చి ప్రేమ‌. అంత‌కు మించి కార్ రేస్ లంటే వ‌ల్ల‌మాలిన అభిమానం.

ఇదిలా ఉండ‌గా త‌ను తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ అవార్డు ప్ర‌క‌టించిన స‌మ‌యంలో త‌న తండ్రిని స్మ‌రించుకున్నారు. ఈ త‌రుణంలో తండ్రి త‌న ప‌క్క‌న లేక పోవ‌డం బాధ‌కు గురి చేస్తోంద‌న్నారు. ఆయ‌న బ‌తికి ఉంటే ఎంతో బాగుండేద‌ని, త‌న‌కు అవార్డు ద‌క్కినందుకు ఎంత‌గానో సంతోషానికి లోనై ఉండే వార‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు అజిత్ కుమార్. ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది. ఎంత ఎత్తుకు ఎదిగినా పెద్ద వారిని గుర్తు పెట్టుకోవ‌డం ప‌ట్ల అభినందించారు నెటిజ‌న్లు.

Also Read : Actors Wishes – Hero Balakrishna : బాల‌య్య‌కు అభినంద‌న‌ల వెల్లువ

Ajith KumarCommentsEmotionalPadma AwardsViral
Comments (0)
Add Comment