Hero Abhiram: ఘనంగా దగ్గుబాటి అభిరామ్ వివాహం

ఘనంగా దగ్గుబాటి అభిరామ్ వివాహం

Hero Abhiram : ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు(D Suresh Babu) తనయుడు, రానా తమ్ముడు అభిరామ్‌ ఓ ఇంటివాడయ్యారు. దివంగత నిర్మాత డి రామానాయుడు స్వగ్రామం కారంచేడుకు చెందిన అత్యంత దగ్గర బంధువు ప్రత్యూష చాపరాలను అభిరామ్ పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో అభిరామ్-ప్రత్యూష జంట ఒక్కటయ్యారు. అభిరామ్ బాబాయ్ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ఈ పెళ్లికి హాజరయ్యారు. సినీ రాజకీయ ప్రముఖుల కోసం శ్రీలంక నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అభిరామ్ పెళ్ళి పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Hero Abhiram – ‘అహింస’తో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చిన అభిరామ్

నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకి ఇద్దరు కొడుకులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగా… రెండో అబ్బాయి అభిరామ్ కూడా ‘అహింస’ అనే సినిమాతో టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. గతంలో ప్రేమ పెళ్ళి పేరుతో అభిరామ్ తనను వాడుకుని వదిలేశాడంటూ… వివాదాస్పద నటి శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆమెకు కోట్లలో పరిహారం ముట్టజెప్పడంతో ఆమె సైలంట్ అయిపోయింది.

Also Read : Tripti Dimri: రవితేజ సరసన ‘యానిమల్‌’ బ్యూటీ..!

daggubati abhiramDaggubati Rana
Comments (0)
Add Comment