Hema: బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు !

బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు !

Hema: బెంగళూరు రేవ్‌పార్టీ కేసులో సినీ నటి హేమను ఎట్టకేలకు అరెస్టు చేసారు. రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని… విచారణకు హాజరుకాలేనని హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపారు. సోమవారం బెంగుళూరు పోలీసులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగించిన కేసులో హేమను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం‌ ఆమెను హాస్పిటల్‌కు కూడా తరలించారు. ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం హేమను 7 రోజుల పాటు పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం.‌

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్‌ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.

Hema – హేమ‌ అరెస్ట్ సరే ! ‘మా’ యాక్షన్ ఎప్పుడు?

‘మా’ సభ్యురాలైన హేమ ఇప్పుడు డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన నేపథ్యంలో ‘మా’ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బెంగుళూరు‌లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో, నటి హేమ(Hema)ను బెంగుళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో తాను లేనని తొలుత హేమ బుకాయిస్తూ… హైదరాబాద్‌లో ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేసినా… ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారని, అందులో హేమ‌ కూడా ఉందని పోలీసులు ఆమె పేరు ప్రత్యేకంగా వెల్లడించారు.

ఇందులో 59 మంది పురుషుల, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌గా పరీక్షించారు. మొత్తంమీద, 103 మంది వ్యక్తులలో 86 మందికి పాజిటివ్ అని తేలినట్లుగా వెల్లడైంది. సోమవారం బెంగుళూరు పోలీసులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగించిన కేసులో హేమను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం‌ ఆమెను హాస్పిటల్‌కు కూడా తరలించారు. ఈ నేపథ్యంలో హేమ(Hema)పై మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమెపై ‘మా’ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది అనేలా అప్పుడు టాలీవుడ్‌లో టాక్ మొదలైంది.

ఇక ఈ కేసులో హేమపై అరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుందని గతంలో మా‌ అధ్యక్షుడు విష్ణు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరీ హేమ(Hema) డ్రగ్స్ తీసుకుందన్నది నిజం… దాన్ని ఆమెకు ఎవరిచ్చారనే దానిపైనే పోలీసులు విచారణ జరగనుంది.‌ రేవ్ పార్టీ ఆర్గనైజర్స్ ఎవరనే దానిపై కూడా క్లారిటి రావాల్సి ఉంది. మరోపక్క డ్రగ్స్‌‌ను రూపుమాపాలంటూ అప్పట్లో ‘మా’ కమిటీ పోలీసులను కలిసింది.‌ అలాంటిది ‘మా’ సభ్యురాలైన హేమ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందని తేలడంతో… హేమ చేసిన తప్పుపై మంచు విష్ణు ఇంతకముందు తాను చెప్పినట్లుగా యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు.‌ ఏ విధంగా తీసుకుంటారనే చర్చ మొదలైంది.

Also Read : Yatra 2: మరో ఓటీటీలో విడుదలైన జీవా ‘యాత్ర 2’ !

Bangalore Rave PartyBanglore PoliceDrugs CaseHema
Comments (0)
Add Comment