Honeymoon Express : ఓటీటీలో హెబ్బా పటేల్ సినిమా ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’

‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు...

Honeymoon Express : చైతన్య రావ్ , హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారనే విషయం తెలిసిందే. ఆయన నటిస్తోన్న చిత్రాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌’ కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడీ సినిమాలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సైతం మంచి స్పందనను రాబట్టుకుంటుందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చిత్ర మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Honeymoon Express Movie OTT Updates

‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్(Honeymoon Express)’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మూవీ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం మెప్పిస్తున్నందుకు చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఆదరిస్తోన్న వారికి ధన్యవాదాలు తెలిపింది.

Also Read : Hero Ram Charan : కృష్ణాష్టమి వేడుకల్లో రామ్ చరణ్ కూతురు ‘క్లింకార’

CinemaHoneymoon ExpressOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment