Garlic : చలికాలంలో బరువు పెరుగుతున్నారా?

వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు

Garlic : చాలా మంది ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. రోజూ వాకింగ్, వ్యాయామం చేస్తుంటారు. కానీ చలికాలం వచ్చిందంటే చాలు కాస్త బద్దం ఎక్కవగా ఉంటుంది.చలికి వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు దీని కారణంగా చలికాలంలో చాలా మంది ఈజీగా బరువు పెరుగుతారు.

అంతేకాకుండా నూనెలో వేయించిన ఆహారాలకు అలవాటు పడి, ఏది పడితే అది తింటారు దీంతో ఎక్కువగా బరువు పెరిగి అనారోగ్య సమస్యల భారిన పడుతారు. అందువలన చలికాలంలో బరువు పెరగ కుండా ఉండాలంటే వెల్లులి తినాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Garlic :

అసలు విషయంలోకి వెళ్లితే .. వెల్లుల్లి(Garlic) ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో టమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, సెలీనియం తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువలన బరువు తగ్గించడంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

రోజూ వెల్లుల్లి తినడం ద్వారా వ్యాయామం చేయకున్నా బరువు తగ్గొచ్చంట. ప్రతిరోజు ఉదయం రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి.ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ ను తీసుకోవాలి.ఈ విధంగా ప్రతిరోజు ప‌చ్చి వెల్లుల్లిని తింటే మెటబాలిజం రేటు పెరుగుతుంది.శరీరంలో క్యాలరీలు కరుగుతాయి.

Also Read : Nap : మధ్యాహ్నం నిద్ర మంచిదేనా?

GarlicHealth TipweightWinter
Comments (0)
Add Comment