Anantha Sriram : గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యంపై ఘాటు విమర్శలు

కేవలం సోషల్ మీడియాలోనే కాదు పలువురు సినీ, సాహిత్య ప్రముఖులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు...

Anantha Sriram : ఇటీవలే ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్(Anantha Sriram) హైందవ శంఖారావం సభలో సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన.. భారత, రామాయణ, భాగవతాల్లో పురాణాలను ఇష్టం వచ్చినట్టు కొందరు మార్చేశారన్నాడు. సినిమాల్లో కర్ణుడు పాత్రకు ఎలివేషన్ ఇవ్వడంపై అభ్యంతరాలను వ్యక్తం చేశాడు. ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే పదం వద్దన్నందుకు 15 ఏళ్లుగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ కు పాటలు రాయలేదని అనంత శ్రీరామ్(Anantha Sriram ) తెలిపాడు. అలాగే హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా ఆ చిత్రాలను బహిష్కరించాలని, అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం ఉంటుందని చాలా పెద్ద స్పీచ్ ఇచ్చాడు. దీంతో అనంత శ్రీరామ్ పై ప్రశంసలతో పాటు విమర్శల వర్షం కురుస్తోంది.

Anantha Sriram…

కేవలం సోషల్ మీడియాలోనే కాదు పలువురు సినీ, సాహిత్య ప్రముఖులు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధానంగా ఆయన గతంలో రాసిన పాటల్లోని సాహిత్యాన్ని టార్గెట్ చేసుకొని ట్రోల్ చేస్తున్నారు. నాగ శౌర్య నటించిన ‘వరుడు కావలెను’ సినిమాలో అనంత శ్రీరామ్ రాసిన ‘దిగు దిగు దిగు నాగ’ పాట వివాదానికి కేరాఫ్ గా నిలుస్తోంది. నాగరాజుపై ప్రేమతో పాడుకునే భజన గీతాన్ని ఐటమ్ సాంగ్ గా మార్చారని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అప్పట్లోనే హిందువుల మనోభావాలను కించపరిచేలా ఈ సాంగ్ ఉందని, వెంటనే తొలగించి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ సంస్థ డిమాండ్ చేసింది. పాట రాసిన అనంత శ్రీరామ్ పై బీజేపీ మోర్చా నాయకులు పలు చోట్ల కేసులు పెట్టారు. దేవుడిని కించపరిచేలా లిరిక్స్ రాశాడని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మండిపడ్డారు. అనంత శ్రీరామ్‌తో పాటు సినిమా యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మూడేళ్లక్రితం జరిగిన ఈ వ్యవహారాన్ని నెటిజన్లు ఇప్పుడు బయటకు లాగారు.. ఇప్పుడు హైందవ ధర్మం గురించి మాట్లాడుతోన్న అనంత శ్రీరామ్ హిందూత్వాన్ని, హిందూ సంప్ర‌దాయాల్నీ కించ‌ప‌రిచేలా అప్పుడు సాంగ్ ఎలా రాసాడని కామెంట్స్ చెస్తున్నారు. అలాగే గరికపాటి పై కూడా గతంలో అనంత్ శ్రీరామ్ తన స్థాయికి మించి కామెంట్స్ చేసిన విషయాన్ని మరోసారి వెలుగులోకి తెస్తున్నారు. అనంత్ శ్రీరామ్ ఏం ఉద్దేశంతో, ఏం ఆశించి.. సినిమాలు అందులోని పాత్రలను టార్గెట్ చేశాడో కానీ..‌ తాను రాసిన పాటలు మాట్లాడిన మాటలు ద్వారా ఇప్పుడు ట్రోలింగ్ అయ్యే పరిస్థితి వచ్చిందనే చర్చ నడుస్తోంది.

Also Read : Kabir Duhan Singh : చేసేది విలన్ పాత్రలైనా పెద్దవాళ్ళకి మాత్రం ఆయనొక హీరో

Anantha SriramCommentsViral
Comments (0)
Add Comment