Harman Baweja: రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్!

రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్!

Harman Baweja:ప్రముఖ బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా రెండోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సాషా రాంచందనీ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ హర్మన్ బవేజా జంటకు అభినందనలు చెబుతున్నారు. డిసెంబరు 2022లోనే వీరిద్దరికి ఓ కుమారుడు జన్మించగా… తాజాగా ఆడిబిడ్డకు జన్మనిచ్చారు.

Harman Baweja:

హర్మన్ బవేజా, సాషా రాంచందనీ 2021లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే హర్మన్ బవేజా చివరిసారిగా స్కూప్‌ లో కనిపించాడు. ప్రస్తుతం సన్యా మల్హోత్రాతో కలిసి ది గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌ లో నటిస్తున్నారు. 2008లో లవ్ స్టోరీ 2050 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు హర్మన్. ఇందులో ప్రియాంక చోప్రా కూడా ప్రధాన పాత్రలో నటించింది. అంతే కాకుండా వాట్స్ యువర్ రాషీ, విక్టరీ, దిష్కియావూన్, ఇట్స్ మై లైఫ్ సినిమాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Also Read :-Naveen Chandra: హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం !

Harman BawejaScoop
Comments (0)
Add Comment