Megastar Chiranjeevi: హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ ?

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ ?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశారు. అందులో వాల్తేరు వీరయ్య మూవీ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. భోళా శంకర్, ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. గాడ్ ఫాదర్, సైరా ఏవరేజ్ అయ్యాయి. ఖైదీ150 మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో హిట్ కొట్టాలనే కసితో మెగాస్టార్ పనిచేస్తున్నారు. బింబిసార ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్నఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 150 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో నలుగురు హీరోయిన్స్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. విశ్వంభర మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా గురించి అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైంది.

Megastar Chiranjeevi Movies Update

మెగాస్టార్ చిరంజీవితో పెద్ద ప్రొడక్షన్స్ నిర్మాతలు అందరూ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ వీరిలో ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే విశ్వప్రసాద్ చిరంజీవికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం హరీష్ శంకర్ పీపుల్స్ మీడియాలోనే రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలు ఎక్కనుంది. ఉస్తాద్ కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో సినిమా చేస్తాడు అని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. కమర్షియల్ డైరెక్టర్ గా మంచి మాస్ ఇమేజ్ ఉండటంతో చిరంజీవి అతనితో సినిమా చేయడానికి మొగ్గు చూపించొచ్చు అనే ప్రచారం నడుస్తోంది.

అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది ఇప్పట్లో తెలిసే ఛాన్స్ లేదు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విశ్వంభరతో బిజీగా ఉన్నారు. హరీష్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ చేసుకుంటున్నారు. ఒక వేళ సినిమా ఉన్నా కూడా వచ్చే ఏడాదిలోనే ఎనౌన్స్ చేయొచ్చని ఇండస్ట్రీ వర్గాల మాట. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి స్పష్టత లేదని తెలుస్తోంది. ఇక మరోవైపు హరీష్ శంకర్ లిస్టు లో యువ హీరో రామ్ పోతినేని కూడా ఉన్నాడు. మరి ఆ కాంబినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Also Read : Sonakshi Sinha: వివాహబంధంలోనికి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి !

Harish SankarMegastar ChiranjeeviPeoples Media Factory
Comments (0)
Add Comment